Gaami trailer : విశ్వక్ సేన్ గామి ట్రైలర్ విడుదల
విశ్వక్ సేన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం గామి చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్ ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లో లాంఛ్ చేశారు. PCX ఫార్మాట్‌లో లాంచ్ చేసే మొట్టమొదటి ట్రైలర్ ఇదే కావడం విశేషం. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో అఘోరా గ నటిస్తున్నాడు. "నేనెవరో.. అసలు ఎక్కడినుంచి వచ్చానో.. నాకీ సమస్య ఎప్పటి నుంచి ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు.." అంటూ విశ్వక్‌సేన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఈ సంభాషణలను బట్టి ఈ చిత్రం సస్పెన్స్‌తో కూడిన ఒక ప్రయోగాత్మక చిత్రంగా భావించవచ్చు.
విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. V సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు