Saindhav Movie OTT Date Confirmed : వెంకటేష్ Saindhav స్ట్రీమింగ్ అందులోనేనా ?
Saindhav Movie OTT Date Confirmed: 2024 సంక్రాంతి కి పెద్ద చిత్రాలైన గుంటూరు కారం (మహేష్ బాబు), నా సామి రంగ (అక్కినేని నాగార్జున) మరియు సైంధవ్ (వెంకటేష్) విడుదల అయ్యాయి. ఈ మూడు చిత్రాలే కాకుండా సంక్రాంతి కి తేజ సజ్జ నటించిన హనుమాన్ చిత్రం కూడా రిలీజ్ అయింది. గుంటూరు కారం, నా సామి రంగ చిత్రాలకు యావరేజ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హనుమాన్ చిత్రం భారీ వసూళ్లు సాధించి సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. కానీ saindhav చిత్రం మాత్రం నిర్మాతల అంచనాలను తలక్రిందులు చేస్తూ విఫలమైంది. ఈ కారణంగా saindhav చిత్రం అనుకున్న టైమ్ కన్నా ముందుగానే OTT లోకి రావడానికి తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.
Saindhav చిత్ర వివరాలు :
Saindhav వెంకటేష్ నటించిన 75వ చిత్రం. దీనికి Dr. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. యాక్షన్ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ తో పాటు బేబీ సారా పాలేకర్, శ్రద్ధా శ్రీనాథ్, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని జనవరి 13న థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. కానీ ఊహించని విధంగా ఈ చిత్రం వెంకటేష్ అభిమానులను నిరాశపరిచింది. సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. కొన్ని సీన్స్ లలో సాగతీత కూడా కొంత ప్రధాన కారణం. అలాగే ఈ సంక్రాంతి బరిలో భారీ విజయం సాధించిన హనుమాన్ ప్రభంజనం లో ఈ చిత్రం కనుమరుగైంది అని చెప్పవచ్చు. ఈ కారణాల వల్ల అనుకున్న దానికన్నా ముందుగానే ఈ చిత్రాన్ని OTT లోకి తీసుకు రాబోతున్నారు.
Saindhav OTT Rights ఖరారు:
దాదాపు రూ.15 కోట్లకు Saindhav మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ Amazon Prime చేజిక్కించుకున్నట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలాఖరుకు OTT లో విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ థియేటర్లలో నిరాశ పరచడంతో ఫిబ్రవరి 2 లేదా 9 తేదీన OTT లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంపై మరి కొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఏది ఏమైనా Saindhav చిత్రం ముందుగానే రావడం అనేది OTT ప్రేక్షకులకు ఆనందదాయకం.
కామెంట్‌లు లేవు